Renuka-Video-Song---Achari-America-Yatra-Songజనవరి 26వ తేదీన అనుష్క ‘భాగమతి’తో పాటు రిలీజ్ కావాల్సిన మంచు విష్ణు “ఆచారి అమెరికా యాత్ర’ పోటీ నుండి తప్పుకుని, మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూసింది. ఆ తర్వాత కూడా కొన్ని రిలీజ్ డేట్స్ ను ప్రకటించినప్పటికీ, అనుకున్న సమయానికి ఆ కార్యాన్ని ముగించలేకపోయింది. దీంతో మే మొదటివారంలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ రజనీకాంత్ “కాలా” సినిమా వాయిదా పడడంతో, ఖాళీ అయిన స్థానంలోకి “ఆచారి అమెరికా యాత్ర” వచ్చింది. మంచు విష్ణుకు జతగా ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మానందం రోల్ చాలా కీలకంగా ఉండబోతోందని దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి స్పష్టం చేసారు. ‘దేనికైనా రెడీ’ సినిమాకు కొనసాగింపు తరహాలో ఉండబోతున్న ఈ సినిమాలో ఫుల్ వీడియో సాంగ్ అప్పుడే రిలీజ్ చేసేసారు.

సాధారణంగా బొమ్మ ధియేటర్లలో పడిన తర్వాత వీడియో సాంగ్ లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈ సినిమా పబ్లిసిటీలో భాగంగా రిలీజ్ కు మూడు రోజుల ముందే వీడియో సాంగ్ ను వదిలేసారు. దీని వలన పెద్దగా చేకూరే ప్రయోజనం లేదు గానీ, గతంలో ‘ఛలో’ సినిమాకు కూడా ఇదే తరహాలో రిలీజ్ కు ముందే ఓ వీడియో సాంగ్ యూ ట్యూబ్ లోకి వదిలేసారు.