Renu-Desaiత్వరలో మరో ఇంటి కోడలు కాబోతున్న రేణుదేశాయ్ ను గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర మనోవేదనకు గురి చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రభావంతోనే ట్విట్టర్ ఖాతాను తొలగించిన రేణుకు, ఇక తన సహనాన్ని పరీక్షించవద్దనే సంకేతాలను ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఒక విధంగా చెప్పాలంటే… పవన్ కళ్యాణ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్ ను రేణుదేశాయ్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో ఇక పవన్ ఫ్యాన్స్ డిఫెన్స్ లో పడక తప్పేలా కనపడడం లేదు.

అసలు పవన్ – రేణుదేశాయ్ లు విడాకులు ఏ పరిస్థితులలో తీసుకోవాల్సి వచ్చింది? అన్న మిస్టరీ ఇప్పటివరకు తేలలేదు, అలాగే దీనిపై ఎలాంటి గాసిప్ కూడా రాలేదు. ఈ అంశాన్ని తన ఆటోబయోగ్రఫీలో పొందుపరుస్తానని రేణు ఒకానొక ఇంటర్వ్యూలో వెల్లడించింది. కానీ ఈ విడాకుల అంశంలో నిజాలు తాను నోరువిప్పితే ఏమవుతుందో మీకు తెలుసా? అంటూ రేణు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా షాక్ కు గురిచేశాయి. దీంతో పవన్ – రేణుల డైవర్స్ లో తప్పు పవన్ దే అన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఎప్పుడూ శాంతమూర్తిగా నింపాదిగా ఉండే రేణుదేశాయ్ ఓపిక నశించినట్లుంది. దీంతో ఇక ఉపేక్షించి లాభం లేదన్న అభిప్రాయంతో ఏకంగా ‘బ్రహ్మాస్త్రం’ లాంటి డైలాగ్ లను వదిలింది. రేణుతో విడాకుల తర్వాత పవన్ అన్నా లేజినోవాతో సహాజీవనం చేయడం, పిల్లల్ని కనడం, అలాగే ఆమెను పెళ్లి చేసుకోవడం తదితర సంగతులు తెలిసినవే. దీంతో ఈ విడాకుల విషయంలో అంచనాలకు అందని “గుట్టు” దాగి ఉందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. రేణు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ తో పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.