Renu Desai Fires on Social mediaపవన్ కళ్యాణ్ అభిమానుల విమర్శలతో ఇటీవల ట్విట్టర్ నుండి వైదొలగిన రేణుదేశాయ్, ఫేస్ బుక్ లో మాత్రం యాక్టివ్ గానే ఉంది. ట్విట్టర్ లో మరీ నేగటివిటీ ఎక్కువగా ఉందని చెప్పిన రేణు, తాజాగా ఫేస్ బుక్ లో అభిమానులతో కలిసి కాసేపు ముచ్చటించగా, యధావిధిగా ఇందులో కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ రేణుదేశాయ్ ను అనేక ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ, సరైన రీతిలో స్పందించి జవాబిచ్చారు.

అందులో ప్రధానంగా చూసుకుంటే… పవన్ కళ్యాణ్ వారసత్వాన్ని కొడుకు అకీరా అందిపుచ్చుకుంటాడని ఇప్పటివరకు భావించిన ఫ్యాన్స్ కు రేణు ఇచ్చిన సమాధానం షాకింగ్ కు గురిచేసింది. ‘అకీరా యాక్ట్ చేస్తాడా?’ అని అడిగిన ప్రశ్నకు ‘యాక్టింగ్ అంటే అకీరాకు ఇష్టం లేదు’ అంటూ చెప్పిన జవాబుతో ఫ్యాన్స్ డీలా పడ్డారు. రేణు నుండి ఇది ఊహించని సమాధానం కాకపోవడంతో, ఈ సారి షాక్ కు గురి కావడం ఫ్యాన్స్ వంతయ్యింది.

‘మీ పెళ్ళికి పవన్ అన్న వస్తారా’ అంటూ అడుగగా, ‘ఆయన్నే అడగండి, సోషల్ మీడియాలో ఉన్నారుగా’ అంటూ జవాబిచ్చారు. ‘పీకే మళ్ళీ కలిసుందామంటే వస్తారా?’ అన్న ప్రశ్నకు ‘మీకు నిజంగా భారతరత్న ఇవ్వాలి’ అని, ‘మీరు చేసుకోవడం మాకు బాధగా ఉంది’ అన్న ప్రశ్నకు ‘నేను పెళ్లి చేసుకుంటానంటే మీకెందుకు బాధ? నేను మీ ఇంటి అమ్మాయి కాదు. మీ ఇంటి అమ్మాయి గురించి మీరు ఆలోచించుకోవాలి. సెలెబ్రిటీస్, పొలిటీషియన్స్ గురంచి ఇంత పర్సనల్ గా మీరు ఆలోచించకూడదని’ జవాబిచ్చింది.