Renu Desai, Renu Desai Clicks Pawan Kalyan, Renu Desai Clicks Power Star Pawan Kalyan Photo, Renu Desai Clicks Pawan Kalyan 2010 Photo, Renu Desai Clicks Husband Pawan Kalyan Photo , Renu Desai Clicks Pawan Kalyan  Photo 2010‘పవన్ కళ్యాణ్ – రేణుదేశాయ్’ల అనుబంధం విషయంలో తెరవెనుక ఏం జరిగిందో తెలియదు గానీ, ఒక భార్యగా రేణు మాత్రం ఇప్పటికీ పవన్ అంటే విపరీతమైన అభిమానం చూపిస్తుంటుంది. సోషల్ మీడియా ద్వారా తన అనుభూతులను పంచుకునే రేణు, తాజాగా 2010లో పవన్ కళ్యాణ్ ను తీసిన ఒక ఫోటోను షేర్ చేసుకుంటూ… తన గత స్మృతులను నెమరువేసుకుంది.

అప్పుడే తెచ్చిన కెనాన్ 5డి కెమెరాతో ‘సూర్యకిరణాలను ఆశ్చర్యంగా చూస్తూ, సైలెంట్ గా కూర్చుని ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఇంటెన్సిటీ తనకు చాలా ఇష్టమని, అలాగే ఈ లుక్ తన ఫేవరేట్’ అంటూ చెప్పిన రేణు, ‘పవన్ చర్మపు రంగు నిజమైనదని, తానూ ఎడిట్ చేయలేదని’ చెప్పుకొచ్చింది. దాదాపుగా 6 సంవత్సరాల క్రితం తీసిన ఈ ఫోటోను తన కెమెరాలో పాటు మదిలో ఉంచుకున్నానని రేణుదేశాయ్ చెప్పకనే చెప్పింది.