Rendu-Rellu-Aaru-Theatrical-Trailerవారాహి చలన చిత్రం బ్యానర్ నుండి వస్తోన్న సినిమా అంటే ఖచ్చితంగా కొత్తదనంతో కూడిన సబ్జెక్ట్ అయ్యుంటుందన్న నమ్మకం సినీ ప్రేక్షకులలో బలంగా నాటుకుని పోయింది. అలా వైవిధ్యభరితమైన సినిమాలను నిర్మించే వారాహి నుండి తాజాగా “రెండు రెళ్ళ ఆరు” అనే సినిమా రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు వీక్షకుల నుండి మంచి స్పందన రాగా, తాజాగా ఆడియోతో పాటు ధియేటిరికల్ ట్రైలర్ ను విడుదల చేసారు.

ఈ సినిమా ‘బేసిక్ థీమ్’ను చిత్ర యూనిట్ ఫస్ట్ షాట్ లో రివీల్ చేసి ఆసక్తిని పెంచింది. తమ భార్యలకు కోరుకునే ‘జెండర్’ కోసం అప్పుడే పుట్టిన పిల్లలను ఇద్దరు తండ్రులు మార్పిడి చేసుకున్న ఆ సీన్ పైనే సినిమా నడుస్తుందన్న విషయం స్పష్టమైంది. అలాగే 22 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలిద్దరూ జాతక రీత్యా ఎప్పుడైనా చనిపోవచ్చు అనే కాన్సెప్ట్ ను జోడించి మరింత ఆసక్తిని కలిగించారు.

వీక్షకులను ఏమోషన్ కనెక్ట్ అయ్యే విధంగా ట్రైలర్ ను బాగానే కట్ చేసారు. అలాగే విజి బుల్గానిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం మరో ప్లస్ పాయింట్. వారాహి ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గలేదు. అయితే ప్రధాన తారాగణంగా ఎంపిక చేసిన అనిల్, మహిమల జోడి మాత్రం మిస్ కాస్టింగ్ లా కనపడుతోంది. సన్నివేశాలకు తగినంతగా హావభావాలను పలికించడంలో విఫలమయ్యారనేది ట్రైలర్ చెప్తున్న విషయం.