remuneration for chiranjeevi for 150 filmఅభిమానులు ఎంతగానో ఎదురుచూసిన మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఇటీవలే కుటుంబ సభ్యుల మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘కొణిదెల ప్రొడక్షన్స్’ బ్యానర్ పై చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అంటే మెగాస్టార్ గారి సొంత సినిమా అన్న విషయం ప్రత్యేకించి చెప్తే… అది మరి నవ్వు తెప్పిస్తుందేమో..!

అలా సొంత బ్యానర్లో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి పారితోషికం విషయంలో ఇటీవల ఓ వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న మహేష్, పవన్ రేంజ్ లోనే చిరంజీవి కూడా ఈ సినిమాకు దాదాపు 30 కోట్ల వరకు పారితోషికాన్ని పుచ్చుకోబోతున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. వినడానికి అభిమానులకు వినసొంపుగా ఉన్న ఈ ఫిగర్… వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే… అసలు ఈ సినిమాకు చిరంజీవి ‘రెమ్యూనరేషన్’ తీసుకోవడం అనేది హాస్యాస్పదంగా మారింది.

150వ ప్రతిష్టాత్మక సినిమా కావడంతో సొంతంగా నిర్మించుకుంటున్న ఈ సినిమాకు చిరుకు ‘ప్రతిఫలం’గా దక్కేది ‘రెమ్యూనరేషన్’ అంటే కూడా ‘లాభం’ అంటే సరిగా సరిపోతుందేమో! ఆ లాభం 30 కోట్లే అవుతుందో లేక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇంకా ఎక్కువ అవుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.