jio-sim-card-relianceటెలికాం రంగాన్ని కుదిపేస్తోన్న రిలయన్స్ జియో సిమ్ ల కోసం ఉన్న డిమాండ్ తెలియనిది కాదు. ప్రజల నుండి వచ్చిన ఈ డిమాండ్ ను చేరుకోలేని జియో, దానికి తగిన విధంగా సిమ్ లను అందించడంలో పూర్తిగా విఫలమైంది. అయితే మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా సర్వీసులను అందిస్తున్న జియో, త్వరలోనే ఇంటి వద్దకు సిమ్ లను డెలివరీ చేసే స్కీంను ప్రవేశపెట్టనుంది.

ప్రస్తుతం జియో సిమ్ కావాలంటే, రిలియన్స్ జియో డిజిటల్ ఎక్స్ ప్రెస్ స్టోర్స్ దాకా వినియోగదారులు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ సిమ్ లు అందుబాటులో లేకపోయిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎలాగోలగో సిమ్ సంపాదించుకున్నా, అది యాక్టివేట్ అయ్యేపాటికి మరో 15 నుండి 20 రోజుల సమయం పడుతోంది. కానీ, ఒక్కసారి ఆన్ లైన్ లో రిలయన్స్ జియో పోర్టల్ లో వివరాలు నింపితే, ఇంటివద్దకే జియో సిమ్ డెలివరీ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తోంది రిలయన్స్ సంస్థ.

ఇంతకు ముందు ఎయిర్ టెల్ ఇదే విధానాన్ని 4జి వినియోగదారుల కోసం అందించింది. 4జి కవరేజ్ లో ఉన్న వినియోగదారులు సిమ్ కావాలంటే, ఎయిర్ టెల్ పోర్టల్ లో వివరాలు నమోదు చేస్తే… 4జి సిమ్ లను ఇంటి వద్దకు డెలివరీ చేసింది. తాజాగా రిలయన్స్ జియో కూడా వినియోగదారుల కోసం ఇదే విధానాన్ని అవలంభించడానికి సిద్ధమవుతోంది.