Reliance Jio Gigafiber, Reliance Jio Gigafiber High Speed Internet, Reliance Jio Gigafiber 1GBPS Internet, Reliance Jio Gigafiber Mumbai, Reliance Jio Gigafiber Puneమొబైల్ సేవల రంగంలో పెను సంచలనానికి తెర తీసిన రిలయన్స్ జియో… తాజాగా ఇంటర్నెట్ సేవల రంగంలోనూ అలజడి రేపింది. ఏకంగా 1 జీబీపీఎస్ (100 ఎండీపీఎస్) స్పీడుతో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు రిలయన్స్ జియో సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ముంబై, పుణే నగరాల్లో ఈ సేవలకు సంబంధించిన ట్రయల్స్ సాగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలో 1 జీబీపీఎస్ స్పీడు కంటే కాస్తంత తక్కువ స్పీడుతో ఆ సంస్థ ఇంటర్నెట్ సేవలను అందించే సత్తాను సాధించింది.

ఇక పుణేలో మాత్రం 1 జీబీపీఎస్ స్పీడుతో ఇంటర్నెట్ సేవలు సాధ్యమేనని ఆ సంస్థ జరిపిన ట్రయల్స్ లో తేలిపోయింది. ఈ రెండు నగరాల్లో ఇంటర్నెట్ సేవలకు సంబంధించి సానుకూల ఫలితాలు రావడంతో ఇక దేశంలోని మరిన్ని నగరాల్లో ‘గిగా ఫైబర్’ పేరిట నామకరణం చేసిన ఈ సేవలను ప్రారంభించేందుకు రిలయన్స్ జియో సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే… ఇంటర్నెట్ సేవల రంగంలోని పలు కంపెనీలకు గడ్డుకాలమే రానుందన్న భావన వ్యక్తమవుతోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో పలు ఆసక్తికర కథనాలు వస్తున్నాయి.