Reliance Jio 4G Download Speed Fastest in Indiaజియో రాకతో ఇంటర్నెట్ సదుపాయం చాలా చీప్ అయిపోయింది. దీంతో అదే ఇంటర్నెట్ ను ఎంత వేగంగా అందిస్తున్నారనేది ప్రామాణికంగా మారిపోయింది. అగ్ర స్థానం కోసం ఎయిర్ టెల్ – జియోల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతుండగా, ఈ సారి వేగం విషయంలో రిలయన్స్ జియో అగ్రస్థానాన్ని అలంకరించింది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. పోటీ సంస్థలతో పోలిస్తే దాదాపు జియో బ్రాడ్‌ బ్యాండ్ వేగం రెట్టింపుగా ఉందని ట్రాయ్ పేర్కొంది.

ట్రాయ్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో జియో నెట్ 16.48 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసింది. జనవరిలో 17.42 ఎంబీపీఎస్‌ వేగాన్ని నమోదు చేసిన జియో ఫిబ్రవరిలో పడిపోయింది. ఐడియా సెల్యులార్ 8.33 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేయగా దేశంలో తమదే ఫాస్టెస్ట్ నెట్‌వర్క్ అని ఊక్లా టెస్ట్‌ లో తేలిందని ప్రకటించుకున్న భారతీ ఎయిర్‌టెల్ ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. ఇక జియో నెట్ వేగంతో కేవలం ఐదు నిమిషాల్లోనే ఓ సినిమాను డౌన్‌ లోడ్ చేసుకోవచ్చని ట్రాయ్ పేర్కొంది.