Is This The Roadmap To Bring Tollywood Back On Its Feet?సుహాస్ మరియు చాందిని చౌదరి నటించిన కలర్ ఫోటో… దాని థియేట్రికల్ విడుదలను దాటవేసి, అల్లు అరవింద్ యొక్క ఆహా లో నేరుగా ప్రదర్శించారు. ఈ మూవీకి మంచి రివ్యూలు, ప్రేక్షకుల నుండి మంచి టాక్ వచ్చింది. సాధారణంగా, చిత్రనిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు విక్రయించినప్పుడు సరైన ప్రచారం చెయ్యడం లేదు.

వచ్చింది చాలు కదా అని వాళ్లు… ఏం చెయ్యాలో తెలియక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సినిమాలను కిల్ చేస్తున్నారు. అల్లు అరవింద్ ఈ దశలో అడుగుపెట్టి, థియేట్రికల్ రిలీజ్ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందు ప్రెస్ షోలు, విజయం తరువాత మీడియా సమావేశాలు, పోస్ట్-రిలీజ్ ప్రెస్ మీట్స్ మరియు సక్సెస్ ,మీట్లు ఏర్పాటు చేస్తున్నారు.

థియేట్రికల్ విడుదలల కోసం చిత్ర పరిశ్రమ ఎలా చేస్తుందో అలానే ఈ సినిమా ను ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల ఆహా చందాదారులు కూడా పెరుగుతున్నారని వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ దిగ్గజాలు ఈ అంశంలో ఆహా నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

ప్రేమ కథలన్నీ సుఖాంతం అవ్వవు. విషాదాంత ప్రేమ కథలు ఇది వరకు మనం ఎన్నో చూశాం. అయితే తెలుగులో అటువంటి విషాదంతం సినిమాలు తక్కువే… చిన్న సినిమా అయినా అటువంటి క్లైమాక్స్ పెట్టడానికి సాహసించి సక్సెస్ అయ్యింది చిత్రబృందం. దానికి ఈ రేంజ్ ప్రమోషన్ చేసి మరింత మందికి చేరువ చేస్తుంది ఆహా.