DLF Chairman Rajiv Singhహెడ్డింగు చూసి ఏంటి సినిమాలో నెల్లూరు పెద్దారెడ్డిలా బయట పెద్దారెడ్లు వచ్చారనుకున్నారా? అయితే వివిరాల్లోకి వెళ్దాం.

గృహ్-హురున్ 2023 సంవత్సరానికి రియల్ ఎస్టేట్ రంగంలో కుబేరుల జాబితా విడుదల చేసింది. ఈ సంవత్సరం కూడా 59,030 కోట్లతో డియల్ఎఫ్ అధినేత రాజీవ్ సింగ్ అగ్రస్థానంలో ఉంటే, 42,270 కోట్లతో మాక్రోటెక్ డెవలపర్స్ మంగళ్ ప్రబాత్ లోదా ద్వితీయ స్థానంలో, ఆర్ఎంజడ్ కార్ప్ అర్జున్ మెండా కుటుంబం 37,000 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఇందులో విశేషం ఏమిటంటే పదో స్థానంతో సహా మెుదటి వంద మందిలో పది మంది తెలుగు వారు ఉండటం. జిఏఆర్ కార్పొరేషన్ అధిపతి జి అమరేంద్ర రెడ్డి 15,000 కోట్లతో టాప్ 10 లో ఉన్నారు. ఇంకా విశేషం ఏమిటంటే ఈ పదిమంది తెలుగు వారిలో ఎనిమిది మంది రెడ్లే ఉండటం.

గత మూడు దశాబ్దాలుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు, వైయస్ జగన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి నాయకుల తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే మురళీమెూహన్ గారు, లింగమనేని ఎస్టేట్స్, రామెూజీ గ్రూప్, నారాయణ, అమరావతిలో కొంత మంది పెట్టుబడిదారులు అనుకునే విధంగా ప్రచారాలు చేసి నమ్మించారు. తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఎకరాల భూములు చంద్రబాబు బినామీలు, ఆయన సామాజికవర్గం చేతుల్లో ఉన్నాయన్నట్టుగా గోబెల్స్ ప్రచారం చేసారు. కానీ ఆ ప్రచారాలను వమ్ము చేస్తూ వాళ్ళు ఆరోపణలు చేసిన ఒక్కరూ ఈ జాబితాలో లేకపోవడం ఒక ఎత్తైతే, వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వైసిపి యంపిగా ఉన్న అయెూధ్య రామిరెడ్డి, అలాగే ఆ పార్టీతో సన్నిహితంగా ఉన్న బొమ్మిరెడ్డి కుటుంబం, అలాగే ఆయన సామాజికవర్గం నుంచే ఐదింట నాలుగు వంతులు ఈ జాబితాలో ఉండటంతో ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులు నోరు మెదపకుండా ఉన్నారు.

అలాగే హురున్ సంస్ధ 2022 కి ఇచ్చిన అత్యంత ధనవంతుల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుండి మెుదటి పదికి ఆరు మంది రెడ్డి వర్గం నుంచే ఉన్నారు. వీరిలో అత్యధికులు వైయస్ కుటుంబానికి సన్నిహితులే. 2004 లో వైయస్ అధికారంలోకి వచ్చాక తెలుగు ధనవంతుల జాబితాలో ఆయన సన్నిహితులు చేరడం ఎక్కువయ్యుందని రాజకీయ, మీడియా వర్గాల్లో చెప్పుకుంటారు. 2004 వరకు తెలుగు రాష్ట్రంలో ధనవంతుల లిస్టులో సామాజిక సమతుల్యం కనబడేది. ఐదారు అగ్రవర్గాల వ్యాపారవేత్తలు కనబడేవారు, కానీ 2004 తరువాత నెమ్మదిగా ఈ వైవిధ్యం తగ్గి రెడ్డి వర్గం నుంచి ప్రతి ఏడు పెరుగుతూ వస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇంత స్ప్రష్టంగా వాస్తవాలు కనబడుతున్నా ఇప్పటికీ జగన్ రెడ్డిపార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు, ఆయన బినామీలు అంటూ గోబెల్స్ ప్రచారాలు చెస్తూనే ఉండటం. మెుత్తానికి అత్యంత ధనవంతుల జాబితాతో పాటు, రియల్ ధనవంతుల జాబితాలో కూడా పెద్దా రెడ్లదే అగ్రతాంబూలం కావడం కొసమెరుపు

Reddy-Community-Tops-in-Real-Estate-Business