Red-Notice success on OTTగత శుక్రవారం నాడు సిల్వర్ స్క్రీన్ ను పలకరించిన సినీ బొమ్మలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేక పోయాయి గానీ, స్మాల్ స్క్రీన్ పై ప్రత్యక్షమైన “రెడ్ నోటీస్” సినిమా మాత్రం సినీ వీక్షకులను అలరిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమాలో డ్వెన్ జాన్సన్ (ది రాక్), ర్యాన్ రేనాల్డ్స్, గల్ గాదొత్ లు ప్రధాన పాత్రలలో నటించారు.

ఎంతో విశిష్టత కలిగిన క్లియోపాత్ర మూడు ఎగ్స్ ను ఎలా దొంగింలించారు అనే కధతో తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం హాస్యంతో మిళితం కావడం విశేషం. సాధారణంగా డబ్బింగ్ సినిమాలలో హాస్యం వీక్షకులకు అంతగా రుచించదు. కానీ ఈ ‘రెడ్ నోటీస్’లో మాత్రం సందర్భోచితమైన డైలాగ్స్ తో ఆహ్లాదకరమైన హాస్యాన్ని పండించడం విశేషం.

ప్రస్తుతం మన తెలుగు సినిమాలలోనే కామెడీ కొరవడుతున్న తరుణంలో బుల్లితెర ప్రేక్షకులను పలకరించిన ‘రెడ్ నోటీస్’ ఓటీటీలో బాగానే సందడి చేస్తోంది. రాక్ – ర్యాన్ ల మధ్య వచ్చే సంభాషణలు హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాలో పండిన అంశం కామెడీ ఒక్కటే కాదు, ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మూవీలో థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా హైలైట్.