Reasons behind YS jagan Chinna Jeeyar Swamy Meetఇటీవలే కాలంలో భాజపా తెదేపాతో తెగతెంపులు చేస్కోనుండని వైకాపాతో జాతకట్టనుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఐతే ఇటీవలే వచ్చిన అన్ని ఎన్నికల ఫలితాలు తెదేపాకు అనుకూలంగా ఉండటంతో ఆ వార్తలకు కొద్ది రోజులు బ్రేక్ పడ్డాయి. ఐతే అవే వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి గత వారం రోజులుగా.

ఈమధ్యనే జగన్ స్వయంగా భాజపా ఎంపీ గోకరాజు రంగరాజు ఇంటికి వెళ్ళి సంఘ్ పరివార్ తో దౌత్యం నడపమని అడిగారని సమాచారం. జగన్ ఈ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచదలిస్తే, డిల్లీలోని కొందరు పెద్దలు కావాలని మీడియాకు ఈ సమాచారం అందించారు. ఎందుకు అనేది ఓపెన్ సీక్రెట్.

మంగళవారం రోజు జగన్ మరియు విజయ సాయి రెడ్డి కలిసి చిన్న జీయర్ స్వామిని కలవడం జరిగింది. సంఘ్ తో ఎలాగైనా బేరం కుదర్చమని బ్రతిమాళడారని మరో సమాచారం. ఒకవేళ ఈ రెండు విషయాలు గనుక నిజం ఐతే భాజపాతో జాతకట్టడానికి జగన్ ఆరాట పడుతున్నాడా? అని అనుమానం కలగడం తప్పేమీ కాదు? ఐతే దీనికి కారణం ఏమీ అవ్వొచు? తన పై ఉన్న కేసులను చూసి జగన్ బయపడుతున్నాడా? లేక తన సొంత బలంతో ఎన్నికలు గెలుస్తాం అన్న నమ్మకం పోయిందా? ఐతే భాజపా తో జత కడితే తన సొంత వోట్ బ్యాంక్ ఐన మైనారిటీల పరిస్తితి ఏంటి?