reasons-behind-paderu-mla-giddi-eswari-tdp-joiningపాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వదిలి సైకిల్ ఎక్కారు. ఆమె పార్టీ మారడం రాష్ట్రం మొత్తానికి ఆశ్చర్యం కలిగించింది కారణం గతంలో ఆమె వైకాపాలో ఉన్న అతిపెద్ద వక్తలలో ఒకరు. జగన్ ను అమితంగా వెనకేసుకొచ్చి, ఒకానొక సందర్భంలో సీఎం తల నరుకుతా అని కూడా అన్నారు. పైగా ఆ పార్టీ అధినేత జగన్ అంటే ఆమెకు ఎనలేని అభిమానం ఉండేది

అటువంటి నేత ఉన్న పళంగా పార్టీ మారడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. అరకు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్ధి విషయమై జగన్ తనను హేళన చేసినట్టుగా మాట్లాడటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. నెలరోజులు మదనపడి చివరకు వైకాపా నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఇది పార్టీలో చర్చనీయాంశం అయ్యింది.

గిడ్డి ఈశ్వరితో సరిగ్గా మాట్లాడి ఉంటే ఆమె ఆగిపోయి ఉండేవారని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఈ ఎపిసోడ్ బట్టి అధినాయకుడిని ఎంత వెనకేసుకొచ్చిన పార్టీలో ఎలాంటి గుర్తింపు, గౌరవం ఉండదని పార్టీ నాయకులు అనుకుంటున్నారు. దీనితో మన పని మనం చూసుకుందాం ఆయన కోసం మనమెందుకు ఈ రచ్చలోకి దిగాలి అని వారంతా అనుకుంటున్నట్టు సమాచారం.

ఆల్రెడీ ఈ రొచ్చులోకి దిగిన వారు కూడా సైలెంట్ అయిపోతే బెటర్ అనుకుంటున్నట్టు సమాచారం. రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్లకు ఎలాగూ తప్పదు. మిగతావారు మాత్రం తమ జాగ్రత్తలో తాము ఉంటె నయం అనుకుంటున్నారంట. ఇలాంటి పరిణామం జగన్ కు ఇబ్బంది కలిగించేదే.