Official: A Dream Combination For Ram Charan And Mega Fansమెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కెరీర్ లో పదిహేనవ చిత్రం కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ సినిమాను నిర్మాత దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా చిత్రం రూపొంద‌నున్నారు. ఇది దిల్ రాజు బ్యానర్ లో 50వ చిత్రం కూడా.

శంకర్ సినిమా… పాన్ ఇండియా మూవీ అని మెగా అభిమానులు ఖుషీగానే ఉన్నా మరోపక్క వారికి ఇంకో లోటు కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కోసం దాదాపుగా మూడేళ్ళుగా వేచి చూడాల్సిన పరిస్థితి. మధ్యలో ఆచార్య గెస్ట్ రోల్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఫ్యాన్స్ కు ఇంకా నిరీక్షణ ఎక్కువ ఉండేది.

తాజాగా శంకర్ తో సినిమా హిస్టారికల్ సినిమా అంటున్నారు. మాములు సినిమాలకు కూడా శంకర్ చాలా టైం తీసుకుంటాడు. అటువంటిది హిస్టారికల్ సినిమా అంటే ఇంకా టైం పడుతుంది. పైగా రాజమౌళి సినిమా వేరు శంకర్ సినిమా వేరు. ఆయన ఈ మధ్య ఫామ్ లో కూడా లేరు. ఈ సమయంలో ఈ ప్రాజెక్ట్ మంచిదేనా అని వారు ఆలోచనలో పడ్డారు.

త్వ‌ర‌లోనే ఈ సినిమాలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం అని దిల్ రాజు ప్రకటించారు. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల తరువాత సెట్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. శంకర్ తన మధ్యలో ఆపిన ఇండియన్ 2 సినిమాను పక్కన పెట్టి ఈ సినిమా చెయ్యబోతున్నారు.