RC-12-First-Lookబోయపాటి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న సినిమా ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా, చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ నుండి అధికారిక పోస్టర్ విడుదలైంది.

‘రంగస్థలం’ సినిమా తర్వాత రామ్ చరణ్ పై భారీ అంచనాలు పెరగడంతో, ఈ మెగా మాస్ మూవీపై ఫ్యాన్స్ భారీ ఆశలనే పెట్టుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కు చిరు పుట్టినరోజు వేదిక కాబోతుందన్న మాట. ఈ న్యూస్ మెగా అభిమానులకు పండగ లాంటిదే కదా!

చిరు పుట్టినరోజుకు ఒక రోజు ముందు “సైరా” సినిమా నుండి టీజర్ విడుదల కానుండగా, ఇప్పుడు బర్త్ డేకు క్లైమాక్స్ టచ్ ఇవ్వడానికి రామ్ చరణ్ సిద్ధమయ్యాడు. దీంతో మెగాస్టార్ పుట్టినరోజును రెండు రోజులు అభిమానులు సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం లభించింది. ప్రస్తుతం సెట్స్ పైనున్న ఇతర మెగా హీరోల సినీ పోస్టర్లు కూడా ఈ సందర్భంగా విడుదల కానున్నాయి.