RBI - Polavaram Projectఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు గ్రహణం పట్టినట్టుగా కనిపిస్తుంది. ఆర్టీఐ ద్వారా కీలక విషయాలు బయటికి వచ్చి ఆందోళనకు గురి చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే తాము నిధులు ఇవ్వనున్నట్టు, తమకు పునరావాసంతో సంబంధం లేదని కేంద్రప్రభుత్వం తేల్చిచెప్పేసింది.

47,575 కోట్ల వ్యయం అయ్యే ప్రాజెక్టు కు కేవలం 20,398 కోట్లు ఇస్తామంటుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. పోలవరం నిర్మాణ వ్యయంలో ఎక్కువ భాగం పునరావాసం కు సంబంధించినదే. 2013 భూ సేకరణ చట్టం బట్టి పునరావాసం ఖర్చు ఎన్నో రేట్లు పెరిగిపోయింది.

ప్రాజెక్టు తాజా వ్యయం 47,575 కోట్లలో దాదాపుగా 30,000 కోట్లకు పైగా పునరావాసం కే. ఇప్పటివరకూ కేవలం 20% పునరావాసం మాత్రమే పూర్తి అయ్యింది. గతంలో పార్లమెంట్ లో పలుమార్లు పునరావాసం బాధ్యత కూడా తమదే అని ఒప్పుకుంది కేంద్రం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం తాము ఏం చేసినా మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో ఆ బాధ్యత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన జగన్ ప్రభుత్వం జీతాలకు పెన్షన్లకే ప్రతినెల వెంపర్లాడుతుంది. అప్పు దొరకక్కపోతే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ వ్యయం పెట్టే సీన్ అయితే లేదు. దీనితో పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్తు పై నీలినీడలు అలముకున్నాయి.