CBI Raids on Former MP Rayapati Sambasiva Raox
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇటీవలే జరిగిన ఎన్నికలలో ఓడిపోయారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారని వచ్చిన కంప్లయింట్ల పై ఈ మధ్యనే ఆయన మీద సిబిఐ దాడి జరిగింది. గతంలో రాయపాటికి చెందిన కంపెనీ పోలవరం కాంట్రాక్టు చేజిక్కిందించుకుంది. దానితో ఆయనను జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఈ తరుణంలో తనను తాను కాపాడుకోవడానికి రాయపాటి బీజేపీలో చేరతారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అటువంటిది ఏమీ లేదని ఆయన తేల్చి చెప్పారు. “పార్టీ మారమని.. ఫలానా పార్టీలో చేరండని ఎవరూ నాపై ఒత్తిడి చేయడం లేదు. రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. ఏ పార్టీలో చేరే ఉద్దేశం నాకు లేదు” అని రాయపాటి చెప్పుకొచ్చారు.

గత ఎన్నికలలో ఆయన తన కుమారుడికి కూడా టిక్కెటు ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేశారు అది కూడా కుదరలేదు. ఇప్పుడు ఆయన రాజకీయాల నుండి తప్పుకుని కొడుకుని ప్రమోట్ చేస్తారేమో చూడాలి. సిబిఐ, ఈడీలకు సంబంధించిన కేసులలో రంగ రావు పేరు లేకపోవడం ఆయనకు కలిసి వచ్చే అవకాశం.

మరోవైపు నా ఆత్మీయులే నాపై ఈడీకి ఫిర్యాదు చేశారు అని రాయపాటి ఆరోపించడం విశేషం. అయితే దీని వల్ల తమకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, కేసుల నుండి తొందరలోనే బయటపడతాం అని ఆయన చెప్పుకొచ్చారు.