Rayalaseema-Love-Story-First-Lookపబ్లిసిటీ పొందాలనే తాపత్రయంతో కొన్ని సినిమాల పోస్టర్లు, టీజర్లు మరీ ఎబ్బెట్టుగా, సినిమాకు సంబంధం లేనట్లుగా ఉంటున్నాయి. అలాంటి ఓ పోస్టరే “రాయలసీమ లవ్ స్టోరీ”కి సంబంధించిన ఫస్ట్ లుక్. విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, ఆ టైటిల్ కు ఏ మాత్రం లింక్ లేకుండా ఈ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

అలాగే టీజర్ ను దీపావళి కానుకగా నవంబర్ 7వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా ఈ సందర్భంగా స్పష్టం చేసారు. రామ్ రణధీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పంచలింగాల బ్రదర్స్ నిర్మించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో రేపిన హంగామాను టీజర్ లో ఎంతదూరం వరకు తీసుకెళ్తారో చూడాలి.