Raw and Bold new concepts in tollywood movies-టాలీవుడ్ లో సరికొత్త కధలు, కాన్సెప్ట్ లు బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన ఫలితాలను చవిచూస్తున్నాయి. ఇప్పటికే “అర్జున్ రెడ్డి” రూపంలో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ బాక్సాఫీస్ ను ఏలగా, ఈ ఏడాదిలో “రంగస్థలం”తో ఏకంగా ‘నాన్ బాహుబలి’ రికార్డులను ప్రేక్షకులు అందించారు. తాజాగా “ఆర్ఎక్స్ 100” ద్వారా మరో ‘రా అండ్ బోల్డ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది.

వినూత్నమైన కాన్సెప్ట్ లతో వస్తోన్న ఈ కాలంలో రొటీన్ కధలు కూడా అంతకు మించే వస్తున్నాయి. అయితే రొటీన్ కధకు కాస్త బోల్డ్ నెస్ జోడించి, ఏదొక కొత్త పాయింట్ తో ప్రేక్షకులను రంజింప చేయడం ఈ సినిమాలలో ఉన్న స్పెషాలిటీ. ప్రస్తుతం ఇదే టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్. ముఖ్యంగా “ఆర్ఎక్స్ 100” ఇచ్చిన ఉత్సాహం సాధారణమైనది కాదు. చిన్న సినిమాలకు మరోసారి జీవం పోసినట్లయ్యింది.

కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే 5 కోట్లకు మించి షేర్ వసూలు చేయడం అనేది చిత్ర యూనిట్ కూడా ఊహించినది కాదు. ఆ ఫీట్ ను అవలీలగా అందుకోవడంతో… ఓవరాల్ గా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సక్సెస్ లలో ఖచ్చితంగా తన స్థానాన్ని “ఆర్ఎక్స్ 100” పదిలం చేసుకుందని చెప్పవచ్చు. ఈ సినిమా స్ఫూర్తితో మరిన్ని సినిమాలు రూపుదిద్దుకుంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.