Raviteja plans to release moviesఒకప్పుడు రవితేజ నుండి ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు పక్కా రిలీజ్ లు ఉండేవి. కానీ ఉన్నపళంగా సినిమాలు తగ్గించేసాడు రవితేజ. ఏడాదికి ఒక్కో సినిమా మాత్రమే చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ నుండి రిలీజ్ నంబర్ పెంచే పనిలో ఉన్నాడు. అవును వచ్చే ఏడాది రవితేజ నుండి మూడు పక్కా రిలీజ్ అవుతాయి. ఇంకొకటి ఉండొచ్చు.

ఒకప్పటి లాగే మళ్ళీ ఏడాదికి మూడు సినిమాలు చేయాలని పక్కగా ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు సినిమాలున్నాయి. ‘ఖిలాడీ’,’రామారావు ఆన్ డ్యూటీ’ తో పాటు ‘ధమాకా’ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఖిలాడీ ఆల్మోస్ట్ ఫినిష్ . రామారావు కి సంబంధించి కొంత వరకే షూట్ మిగిలి ఉంది. ఒకటి లేదా రెండు షెడ్యుల్స్ ఉన్నాయంతే. ధమాకా కూడా జెట్ స్పీడులో ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. ఇందులో డ్యుయల్ రోల్ చేస్తున్నాడు రవితేజ. మరో రెండు మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. సుదీర్ వర్మ డైరెక్షన్ లో #RT70 సినిమా చేయనున్నాడు. సుదీర్ వర్మ తో స్వామీ రారా నుండి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు రవితేజ. ఎప్పటి నుండో చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్ గా ఇప్పటికి ఈ కాంబో ఫిక్సయింది. మరి ఉన్నట్టుండి రవితేజ మరి ఇంత స్పీడ్ ఎందుకు పెంచాడు ? హీరోగా ఓ రెండు మూడేళ్ళు ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తాడా ? లేదా ? చూడాలి.