ravi-ashwinటీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత వందేళ్లలో ఎవరికీ సాధ్యం కానటువంటి ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో స్ట్రైక్ రేట్ (ఒక్కో వికెట్ కు తీసుకునే బంతులు) పరంగా చూస్తే, గత వందేళ్ల క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే… మన అశ్విన్ టాప్ స్థానంలో నిలిచాడు. 49.4 బంతులకో వికెట్ చొప్పున బెస్ట్ ‘స్ట్రైక్ రేట్’తో అశ్విన్ దూసుకెళ్తున్నాడు.

ఈ వందేళ్ల కాలంలో ఇంతవరకు 50 కన్నా తక్కువ స్ట్రైక్ రేట్ గల బౌలర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. అశ్విన్ తరువాతి స్థానంలో 54 స్ట్రైక్ రేట్ తో మెక్ గిల్ (ఆస్ట్రేలియా), 55 స్ట్రైక్ రేట్ తో ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక)లు ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి బీఎస్ చంద్రశేఖర్ (13వ స్థానం), అనిల్ కుంబ్లే (14) ఉన్నారు. ఇక ఆల్ టైం టెస్ట్ హిస్టరీకి వస్తే… 1910లో క్రికెట్ ఆడిన ఇంగ్లండ్ బౌలర్లు జానీ బ్రిగ్స్, కొలిన్ బ్లైత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో అశ్విన్ ఉండగా… స్పిన్ దిగ్గజాలు మురళీధరన్, షేన్ వార్న్ లో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు.