ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడు తెలుగు సినిమాలలో పాజిటివ్ టాక్ పరంగా “భలే మంచి రోజు” ముందుంది. ప్రిన్స్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు నటించిన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాలలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రంగా నిలిచిన “భలే మంచి రోజు” చిత్రాన్ని మాస్ మహారాజ రవితేజ కూడా వీక్షించారు.

చూడడమే కాదు, వాట్సప్ లో హీరో సుధీర్ బాబుకు ‘కంగ్రాట్స్’ కూడా పంపించారు. దానికి ప్రతిస్పందనగా, కృతజ్ఞతలు తెలిపిన సుధీర్, నీ స్పందన నాకేంతో విలువైనదని చెప్పాడు. అలాగే, ‘బెంగాల్ టైగర్’ సినిమా సక్సెస్ కు నీక్కూడా ‘కంగ్రాట్స్’ అంటూ రిటర్న్ సందేశాన్ని పంపాడు. ఈ ఉదంతాన్ని తన మొబైల్ లో స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు సుధీర్ బాబు.ravi teja whatsapp message on bhale manchi roju