Ravi teja used NAllamala Bujji Car to attend SIT interrogationరాత్రంతా ఓ స్టార్ హోటల్ లో బస చేసిన ‘మాస్ మహారాజా’ రవితేజ సిట్ విచారణకు సెంటిమెంట్ ‘వైట్’ షర్టుతో కాకుండా, చెక్స్ షర్టుతో హాజరయ్యారు. ఇప్పటివరకు ఈ విచారణకు హాజరైన పురుషులంతా వైట్ షర్టుతో విచ్చేయగా, ఇద్దరు మహిళలు బ్లూ కలర్ ను ఎంచుకున్నారు. అయితే రవితేజ మాత్రం ఇలాంటి సెంటిమెంట్స్ కు విరుద్ధంగా చెక్స్ షర్టుతో దర్శనమిచ్చారు. రవితేజ స్టార్ హోటల్ ఉన్నాడని తెలుసుకున్న మీడియా వర్గీయులు, సదరు హోటల్ నుండే రవితేజను ఫాలో అవ్వడం ప్రారంభించారు.

Also Read – పిఠాపురం MLA గారి తాలూకా ఎలివేషన్స్..!

బహుశా తనను గుర్తించకూడదని భావించుకున్నారో ఏమో గానీ, తన కారుకు బదులు నిర్మాత నల్లమలపు శ్రీనివాస్ అలియాస్ బుజ్జి కారులో సిట్ కార్యాలయానికి వచ్చారు రవితేజ. టీఎస్ 09ఈఎల్ 3334 నెంబరు గల వాహనంలో రావడంతో, ఈ బండి ఎవరిదో తెలుసుకోవాలన్న తాపత్రయంతో సదరు వాహన నెంబర్ ను ఆన్ లైన్ లో కొట్టగా, నల్లమలపు శ్రీనివాసరెడ్డి పేరుతో ఉందన్న విషయంతో పాటు, సదరు వాహనంపై గత ఏడాదిలో ఆరు పెండింగ్ చలానాలు ఉన్నాయన్న విషయం కూడా చూపించింది.

దీంతో ఇపుడు నల్లమలపు బుజ్జి వాహనం హైలైట్ అయ్యింది. ఓవర్ స్పీడుతో ప్రయాణించడం, రాంగ్ పార్కింగ్ చేయడం, కారు డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడుతుండడం వంటివి ఆరు పెండింగ్ చలానాలు హైదరాబాద్ ట్రాఫిక్ ఈ చలాన్ వెబ్ సైట్ లో చూపిస్తున్నాయి. ఈ ఆరు పెండింగ్ చలానాలకు గానూ మొత్తం 2175 రూపాయలను జరిమానా చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం సదరు నిర్మాతకు పెద్ద విషయం కాకపోయినా, రవితేజకు వాహనం ఇస్తే, ప్రస్తుతం బుజ్జి పేరు మీడియాలో హైలైట్ అవుతుండడం విశేషం.

Also Read – బెంగాలీ స్వీట్ VS ధమ్ బిర్యానీనా…?