Ravi Teja Touch Chesi Chudu Teaser Talkమాస్ మహారాజా రవితేజ టచ్ చేసి చూడు ఫస్ట్ లుక్ టీజర్ కాసేపటిక్రితం విడుదలయ్యింది. టీజర్ లో పెద్దగా ఏమీ లేకపోయినా మాస్ మహారాజా తన స్టైల్ మరియు ఆటిట్యూడ్ తో ప్రేక్షకులను కట్టి పడేసాడు. అదే విధంగా ప్రీతమ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. మొత్తానికి టీజర్ వల్ల చిత్రానికి పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది.

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజా అలరించబోతున్నారు. ఫిబ్రవరి 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు. రవితేజ సరసన రాశి ఖన్నా మరియు సీరత్ కపూర్ హీరోయిన్లుగా కవ్వించబోతున్నారు. రేసుగుర్రం రచయిత విక్రమ్ సిరికొండ ఈ చిత్రంతో దర్శకుడిగా అవతారం ఎత్తబోతున్నారు.

రేసుగుర్రం నిర్మాత నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తెలుగు దేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశి సహానిర్మాతగా వ్యవహరించబోతున్నారు. సహజంగా సినిమాలకు డల్ పీరియడ్ గా చెప్పే ఫిబ్రవరిలో వచ్చి భారీ హిట్ కొట్టడానికి ఆరాటపడుతున్నాడు మన మాసుమహారాజా రవితేజ.