Nela Ticket Poster1రవితేజ సినిమాలంటే ‘పక్కా మాస్’ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రాబోయే సినిమా మాత్రం మరీ ‘ఊర మాస్’ సినిమాలా కనపడుతోంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “నేల టికెట్టు” సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై, ఫుల్ మాస్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా మరో స్టిల్ ను విడుదల చేయగా, ఇది మరీ ఊర మాస్ టాక్ తో హల్చల్ చేస్తోంది.

బ్యాక్ గ్రౌండ్ లో పులివేషగాళ్ళు డ్యాన్స్ లు వేస్తుండగా, ఫోర్ గ్రౌండ్ లో గళ్ళ చొక్కా, జీన్స్ ప్యాంట్ తో రవితేజ లుక్ ఆయన ఇమేజ్ కు తగ్గట్లుగా ఉంది. ‘సోగ్గాడే చిన్ని నాయానా, రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో క్లాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న కళ్యాణ్ కృష్ణ, బహుశా తనలో ఉన్న మాస్ కోణాన్ని “నేల టికెట్టు”లో మాస్ మహారాజా రవితేజ రూపంలో ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావిస్తున్నారేమో చూడాలి!