Ravi Teja- Krack Movie postponed మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న క్రాక్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా చివరి నిముషంలో ఆగిపోయింది. నిర్మాత ఠాగూర్ మధు గతంలో చేసిన ఆరోగ్య అనే తమిళ సినిమా ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల చివరి నిముషంలో సినిమా వాయిదా పడింది. మొదటిగా బెనిఫిట్ షోలు… ఆ తరువాత మార్నింగ్ షోలు… ఆ తరువాత మ్యాటినీలు క్యాన్సిల్ అవుతూ వచ్చాయి.

మొత్తంగా సినిమా ఈరోజు విడుదల కాదంటున్నారు. ఏకంగా ఈ నెల 13కు వాయిదా పడొచ్చు అని సమాచారం. ఈరోజు విడుదల ఉంటే నాలుగు రోజులు ఫ్రీ గ్రౌండ్ కారణంగా ఎడ్వాంటేజ్ అయ్యేది. ఇప్పుడు 13 రిలీజ్ అంటే మాస్టర్ తో పోటీ… థియేటర్లు దొరకవు… పైగా పోటీలో ఆడియన్స్ డివైడ్ అవుతారు.

ఏ రకంగా చూసుకున్న మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే. సినిమాకు 20 కోట్ల మేర ప్రీ-రిలీజ్ బిజినెస్ అయ్యింది. కాంపిటీషన్ లో అంత రేట్లు కుదరవు మళ్ళీ ఆ పంచాయతీ కూడా ఉంటుంది. రవితేజ కేరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ ప్లాన్ చేసుకుని చివరి నిముషంలో చేసిన పొరపాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి.

2021లో విడుదల అవ్వాల్సిన మొదటి పెద్ద చిత్రం క్రాక్ అయితే ఈ రకంగా బ్యాడ్ ప్లాన్నింగ్ తో ఎఫెక్ట్ అయ్యింది. గతంలో తనకు డాన్ శీను, బలుపు వంటి హిట్ చిత్రాలు ఇచ్చిన గోపీచంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై రవితేజ చాలా ఆశలే పెట్టుకున్నాడు. చూడాలి ఇక ముందు ఏం జరుగుతుందో?