మాస్ మహారాజా రవితేజ నటించిన డిస్కో రాజా చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకు నిరాశాజనకమైన టాక్, రివ్యూస్ వచ్చాయి. అయితే చాలా లిమిటెడ్ రిలీజ్ కావడం వల్ల ఎక్కడికక్కడ థియేటర్లు బానే నిండాయి. అయితే ఈ టాక్ ఇప్పుడు స్ప్రెడ్ కావడంతో ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

రిపబ్లిక్ డే సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రవితేజ ఉన్న ప్రస్తుత ఫామ్ కు, ఇప్పుడు ఈ సినిమాకు వచ్చిన టాక్ కు పరిస్థితి అంత తేలికగా ఉండబోదు అనే అనుకోవాలి. అయితే ఇది సంక్రాంతి పెద్ద సినిమాలు …. సరిలేరు నీకెవ్వరూ మరియు అల వైకుంఠపురంలో సినిమాలకు కలిసి వచ్చేదే అని చెప్పుకోవాలి.

ఇక డిస్కో రాజా విషయానికి వస్తే… డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ సైన్ ఫిక్షన్ యాంగిల్ లో బానే లాగించాడు. దీనితో ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించినా, రెండో భాగం పూర్తిగా రొటీన్ గా సాగింది. సినిమాకు సెల్లింగ్ పాయింట్ అయిన సైన్ ఫిక్షన్ యాంగిల్ వదిలెయ్యడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టింది. దానితో ఈ విధమైన టాక్ తప్పలేదు. ఒకరకంగా మంచి అవకాశం పోగొట్టుకున్నారనే చెప్పుకోవాలి.

రవితేజ చాలా కాలం నుండి హిట్ అనేది లేక సతమతమవుతున్నాడు. వరుస ప్లాపులతో ఆయన మార్కెట్ నెమ్మదిగా తగ్గిపోతూ వస్తుంది. ఈ తరుణంలో ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఆయనది. ఈ క్రమంలో ఇటువంటి పరిస్థితి ఎదురుకావడం ఇబ్బందనే చెప్పుకోవాలి. దీనితో ఆయన పూర్తి ఆశలన్నీ తన తదుపరి చిత్రం క్రాక్ మీదే పెట్టుకున్నారు.