Ravi Teja - about pawan kalyanకల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన చిత్రం నేలటిక్కెట్టు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు హాజరైన రవితేజ మాట్లాడుతూ, ‘పదేళ్ల క్రితం ఒకరికి నేను ఫోన్ చేశాను. ఆ వ్యక్తి పక్కన పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కల్యాణ్ నాకు ఇచ్చిన కాంప్లిమెంట్.. ‘మీరు అంత సిగ్గులేకుండా ఎలా చేస్తారండి?’ అని అన్నారు.

ఈ కాంప్లిమెంట్ ను నేనెప్పటికీ మర్చిపోలేను. ఇది వరకు ఇధ్దరం బాగానే కలుసుకుంటూ ఉండే వాళ్లం. ఇప్పుడు బిజీ అయిపోవడంతో కలవలేకపోతున్నాం. పవన్ కల్యాణ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ‘నేలటిక్కెట్టు’ సినిమా గురించి చెప్పాలంటే.. ఈ సినిమా విజయం సాధిస్తుంది’ అని రవితేజ అన్నాడు.

ఇక పవన్ మాట్లాడుతూ… ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడంటే.. ఆ వ్యక్తి గుండెల్లో ఎంతో కొంత ఆవేదన, బాధ లేకపోతే హాస్యం రాదని, అందుకనే, రవితేజ అంటే తనకు ఇష్టమని అన్నారు. రవితేజ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చారని, ఆ కృషిని అభినందిస్తున్నా. ఎంతమంది మధ్యలోనైనా సరే, రవితేజ సిగ్గుపడకుండా అవలీలగా నటించేస్తాడు. నేను అలా నటించలేను. అందుకే, రవితేజ నాకు స్ఫూర్తి’ అని ప్రశంసించారు.