Ravi-babu---Adhugoకొత్తదనానికి తన సృజనాత్మకతను జోడించి సినిమాలను రూపొందించడంలో దర్శకుడు రవిబాబుది ఓ ప్రత్యేకమైన శైలి ఉంది. ఓ పక్కన నటుడిగా కొనసాగుతూనే మరో పక్కన సినిమాలను తెరకెక్కించే రవిబాబు, గత కొంతకాలంగా “అదిగో” అనే ఒక్క సినిమాపైనే ఫోకస్ చేసాడు. పందిపిల్లతో తెరకెక్కించిన ఈ సినిమాను ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

నిజానికి ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ ప్రాజెక్ట్ సాంకేతిక కారణాలు చూపుతూ ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ రాగా, ఫైనల్ గా సెప్టెంబర్ లో విడుదల కానుందని సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రవిబాబు సొంత నిర్మాణ సంస్థ ‘ఫ్లైయింగ్ ఫ్రాగ్ పతాకం’పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. అంతిమంగా ఈ సినిమా విడుదల కావడం రవిబాబు సినిమాలను ప్రేమించే వారికి శుభవార్తగా పేర్కొనవచ్చు.