హైదరాబాద్ లో ఓ ముస్లిం యువతిని వేధించిన కేసులో నిర్భయ కేసును ఎదుర్కొంటూ రిమాండ్ లో ఉన్న ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ కు బెయిల్ మంజూరైంది. ఆయనతో పాటు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న కారు డ్రైవర్ కు కూడా బెయిలు మంజూరైంది.
బంజారాహిల్స్ పరిధిలో కారులో వెళుతున్న రావెల సుశీల్, ఓ యువతి చెయ్యి పట్టుకుని కారులోకి లాగాడన్న ఆరోపణలపై కేసు నమోను కాగా, తన కొడుకు అమాయకుడని, వైకాపా నేత జగన్ చేసిన తప్పుడు ప్రచారం కారణంగా బలయ్యాడని సుశీల్ తండ్రి కిశోర్ బాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అయితే, ‘నిర్భయ’ వంటి కేసుల్లో కూడా నిందితులుగా ఆరోపించబడ్డ వారికి తేలికగా బెయిల్ లభించడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. అందులోనూ రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మన భారతదేశంలో జరిగే “న్యాయం” గురించి తెలియనిది కాదని ఆవేదన వ్యక్తపరుస్తున్న జాబితా చాలా ఉంది.