Ratul Preet singh doubts on #MeTooరకుల్ ప్రీత్ సింగ్…ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు..ఎందుకంటే ఈ సోయగాల సుందరి అంత ఫేమస్. దాదాపుగా తెలుగు యువ హీరోలు అందరితో కలసి రొమ్యాన్స్ చేసింది ఈ అందాల భామా. అయితే ప్రస్తుతానికి పెద్దగా చేటులో సినిమాలు ఏమీ లేకపోవడంతో ఫోటో షూట్స్ మరియు ఇంటర్‌వ్యూస్ ఇస్తూ మీడియాలో హల్‌చల్ చెయ్యడానికి ట్రై చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రకుల్ “#MeeToo” పై కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు అవే కామెంట్స్ సోషల్ మీడియా, సినిమా సర్కిల్స్ లో కాస్త హాట్ హాట్ చర్చకు దారి తీశాయి. ఈ “ “#MeeToo” ” పై ఆమె మాట్లాడుతూ తనకు ఏ ఇండస్ట్రీలో అలాంటి అనుభవం ఎదురు కాలేదు అని తెలుపుతూనే…తనపై కొందరు చిన్న తారలు చేసిన కామెంట్స్ పై పెద్దగా పట్టించుకోను అని కొట్టి పారేసింది. అంతేకాదు అసలు ఈ “ “#MeeToo” ” ఉద్యమంలో నిజమైన వాళ్ళు ఎవరో? అన్న సందేహం కూడా కలుగుతుంది అంటుంది రకుల్.

ఇక ఇంటర్వ్యూలో భాగంగా మీరు ఒక 24 ఎవ్వరికీ కనపడకుండా మాయం అయిపోతే ఏం చేస్తారు అని అడిగితే….ఈ “ “#MeeToo” ” వెనుక అసలు ఎవరున్నారు అనే నిజాన్ని కనిపెడతా అంటుంది ఈ బ్యూటీ. అంటే ఆమె చెబుతున్న దాని ప్రకారం…పైకి పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తున్నా లోలోపల మాత్రం రకుల్ ఈ విషయాన్ని కాస్త సీరియస్ గానే తీసుకుంది అని చెప్పవచ్చు.