Rashmika-Mandanna-Remuneration-Hikeఏ హీరోయినైనా వరుసగా ఒక హీరోతో రెండు సినిమాలు చేస్తే వారి మధ్య ఏదో నడుస్తుంది అని పుకార్లు రావడం సహజమే. విజయ్ దేవరకొండతో గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన రష్మిక ఈ శుక్రవారం విడుదలయ్యే డియర్ కామ్రేడ్ లో కూడా స్క్రీన్ పంచుకుంది. ఆ మధ్య ఓ కన్నడ నటుడితో పెళ్లి సెటిలై, అది రద్దయిన తరువాత ఈమె హీరో విజయ్ దేవరకొండకు దగ్గరైందంటూ పుకార్లు వచ్చాయి. దీనిపై ఒక ఇంటర్వ్యూలో ఆమె నర్మగర్భంగా వివరణ ఇచ్చింది.

“ప్రస్తుతం నేను సింగిల్ గా ఉన్నాను. డేటింగ్ చేసేంత టైమ్ నాకు లేదు. సినిమా సెట్స్ నుంచి ఇంటికెళ్లడం, అట్నుంచి అటు జిమ్ కు వెళ్లడం, మళ్లీ ఇంటికి రావడంతోనే సరిపోతోంది. రాత్రి 11-12కు ఇంటికొచ్చి పడుకొని మళ్లీ ఉదయం 6 గంటలకు షూటింగ్ కు రెడీ అవుతున్నాను. ఒక్కోసారి తిండి కూడా మరిచిపోతున్నాను,” అని ఆమె చెప్పుకొచ్చింది. సహజంగా ఇటువంటి ప్రశ్నకు ఏ హీరోయిన్ అయినా కామన్ గా ఇచ్చే సమాధానం ఇదే. రష్మిక కూడా అలాగే చెప్పిందా లేక నిజంగానే ఏమీ లేదా?

మరోవైపు ఇటీవల ఓ తమిళ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… తాను కన్నడ సరిగా మాట్లాడలేనని రష్మిక చెప్పింది. కన్నడ భాషలో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం అని తెలిపింది. కన్నడ ఇండస్ట్రీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె… తన మాతృభాషను మాట్లాడలేకపోవడమేంటని అక్కడి భాషాభిమానులు ఫైర్ అవుతున్నారు. శాండల్‌వుడ్ నుంచీ ఆమెను తప్పించాలనీ, ఆమెపై నిషేధం విధించాలని డిమాండ్ పలు బాషా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.