Jabardath Anchor Rashmi - adhi nextతమ ఇద్దరి మధ్య ఏమీ లేదని చాలా సందర్భాలలో రష్మీ – సుధీర్ లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా పుకార్లు పుట్టుకురావడం మళ్ళీ అవే ప్రశ్నలు ఎదురు అవుతుండడంతో… సహనం కోల్పోయే పరిస్థితి నెలకొంటోంది. ప్రస్తుతం రష్మీ విషయంలో అదే జరిగింది. ట్విట్టర్ లో ముచ్చటిస్తున్న సమయంలో… ఓ నెటిజన్ నుండి ‘సుధీర్ ను పెళ్లి చేసుకోండి, మీ ఇద్దరి జంట బాగుంటుంది, ఇద్దరు మీ మీ కెరీర్ల కోసం బాగా హార్డ్ వర్క్ చేసారు’ అంటూ తెలిపాడు.




దీనికి రిప్లై ఇచ్చిన రష్మి… సదరు నెటిజన్ కు ఓ చిన్నపాటి క్లాస్ నే తీసుకుంది. ‘మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మీరు ఎలా నిర్ణయిస్తారు? కేవలం స్క్రీన్ పైన చూసి డిసైడ్ చేసేస్తారా? రీల్ లైఫ్ కు, రియల్ లైఫ్ ను వేరు చేసి చూడాల్సిన సమయం ఆసన్నమైంది, ప్రేక్షకులను అలరించడం కోసం తాము అలా చేస్తాము, అంతేతప్ప ఏం లేదు, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో మీ సలహాలు అస్సలు అవసరం లేదు’ అంటూ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఒకే ప్రశ్నకు అన్నిసార్లు జవాబు చెప్పాల్సి రావడం ఎవరికైనా ఇబ్బందిని కలిగించేదేగా!

Also Read – సురేఖగారూ… ఇది చాలా ఓవర్ కదా?