Rashi-Khanna-bikiniరవితేజ హీరోగా తమన్నా మరియు రాశి ఖన్నాలు హీరోయిన్స్‌గా నటించిన ‘బెంగాల్‌ టైగర్‌’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా కొన్ని గంటల్లో విడుదల కాబోతున్న సమయంలో సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తోంది. ఈ సినిమాలో రాశి ఖన్నా ఒక పాటలో బికినీతో దుమ్ము రేపబోతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. దాంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగి పోయాయి. భారీ అందాల సుందరి బికినీలో కనిపిస్తే సంచలనమే అని యూత్‌ ఆడియన్స్‌ అంటున్నారు.

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది. కాని కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అవ్వగా మరి కొన్ని ఈమెకు గుర్తింపును తీసుకు రావడంలో విఫలం అయ్యాయి. దాంతో ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రంపైనే ఈమె ఆశలు అన్ని కూడా పెట్టుకుని ఉంది. అందుకే మొహమాటం వదిలేసి బికినీని కూడా వేసినట్లుగా తెలుస్తోంది. మరి ఈమె చేసిన సాహసంకు ఇప్పటికి అయినా సక్సెస్‌ దక్కేనో చూడాలి. ఇదే సినిమాలో తమన్నా కూడా తన అందాను భీభత్సంగా వడ్డి వార్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి తమన్నా అందాల ముందు ఈమె నిలుస్తుందా అనేది చూడా చూడాలి.