MLA, Rasamayi Balakrishna, Brahmotsavam Movie, Mahesh babu, Pichaikkaran, Bichagadu Telugu Movie, kollywood, Tollywood, Telugu movie newsకరీంనగర్ జిల్లా, మనకొండూర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజాప్రతినిధిగా కంటే సినీ వేడుకలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. తాజాగా ఓ సినీ వేడుకలో పాల్గొన్న రసమయి… “సినిమాలలో చిన్న, పెద్ద సినిమాలంటూ బేధాలు ఉండవని, ఇటీవల ఓ సినిమా బాగుందని విన్నాను, ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నప్పటికీ ఆ సినిమా చూసాను, ఒక మంచి కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాలో హీరో కూడా తనకు తెలియదని…” అని ‘బిచ్చగాడు’ సినిమా గురించి వ్యాఖ్యానించారు.

“ఈ సినిమా విడుదలైన సమయంలోనే ఒక పెద్ద సినిమా విడుదలైందని, అయితే “బిచ్చగాడు” ఏమో ‘బ్రహ్మోత్సవం’గా నడిచింది, “బ్రహ్మోత్సవం” ఏమో ‘బిచ్చగాడు’ అయిపోయిందంటూ మహేష్ సినిమా ‘బ్రహ్మోత్సవం’పై సెటైర్లు వేసారు రసమయి. అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయికి ఏం కొత్త కాదు. గతంలో మహేష్ బాబు ‘సంతూర్’ యాడ్ పై, ‘బాహుబలి’ సినిమాపై కూడా రసమయి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అయితే, ‘శౌర్య’ సినిమా ఆడియో వేడుకలో హీరోయిన్ రెజీనాకు నేను పెద్ద అభిమానిని, హైటు తక్కువ అయ్యింది, లేదంటే… తానూ కూడా హీరోగా రెజీనా సరసన ఒక సినిమా చేసేవాడిని అంటూ అప్పట్లో రసమయి సృష్టించిన సందడి అంతా ఇంతా కాదు. ఇలా ఒక ఎమ్మెల్యే హోదాలో సినీ వేడుకలపై సందడి చేస్తూ, సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు.