infosys-rapeఇన్ఫోసిస్ లాంటి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో రేప్ ఘటన కలకలం రేపుతోంది. పుణే లో ఇన్ఫోసిస్ క్యాంపస్ లో 25 ఏళ్ళ మహిళ అత్యాచారానికి గురైయ్యిందని స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 27న వాష్ రూం లో కి వెళ్ళిన తనని ఇద్దరు క్యాంటీన్ వర్కర్స్ అత్యాచారం చేసి చిత్రీకరించి, బ్లాక్మెయిల్ చేస్తున్నారని అక్కడ క్యాంటీన్ లో చేస్తున్న మహిళ సోమవారం నాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

బాధితురాలు ఇచ్చిన సమాచారంతో, ఓ ఇద్దరి నిందితలను పోలీస్ లు అదుపులోకి తీసుకొని మెడికల్ టెస్ట్ లు చేయించి కేసు విచారిస్తున్నారు. ఇన్ఫోసిస్ ప్రాంగణాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు మరియు లైంగిక వేధింపులకి వ్యతిరేకంగా కఠిన విధానం విదించి పోలీసు దర్యాప్తుకు సహాకరిస్తామని ఇన్ఫోసిస్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.