Rapaka Varaprasadraoగడచిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచింది. గెలిచిన నాటి నుండి ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగానే ప్రవర్తిస్తున్నారు. జనసైనికులు కూడా రాపాక పార్టీలో ఉంటారని అనుకోవడం లేదు. ఇటీవలే కాలంలో రాపాకకు పార్టీకు గ్యాప్ కూడా వచ్చింది.

అసెంబ్లీలో పార్టీ స్టాండుకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడడంతో అది మరింత తీవ్రం అయ్యింది. ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చారని ప్రచారం జరిగినా అటువంటిది ఏమీ జరగలేదు. అయితే ఆ తదనంతరం టీవీ ఛానల్స్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన కాదు అంటున్నా పార్టీలో మారడం అనేది ముహూర్తం మాత్రమే మిగిలి ఉంది అని అనిపించక మానదు.

వల్లభనేని వంశీని టీడీపీ నుండి బయటకు తీసుకువచ్చి ప్రత్యేక సభ్యుడిగా గుర్తించింది వైఎస్సార్ కాంగ్రెస్. ఆ రంగంగా ఉపఎన్నికలకు కూడా వెళ్లకుండా అయ్యింది. దానితో పాటు రాపాక విషయంలో ఇంకో ఆప్షన్ కూడా ఉందట. మొన్న ఈ మధ్య రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయించుకున్నట్టు జనసేన లెజిస్లేటివ్ పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ లో విలీనం చెయ్యవచ్చు.

ఉన్నది ఒక్క ఎమ్మెల్యేనే కాబట్టి అది సునాయాసంగా జరిగిపోతుంది. ఆ రకంగా రాపాక డైరెక్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిపోవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాలలోకి తిరిగి వెళ్లిన మరుక్షణం రాపాక పార్టీని భవిష్యత్తు లేదని చెప్పి పార్టీ మారేందుకు సిద్ధం కావొచ్చని ఆయన నియోజకవర్గంలో వినిపిస్తుంది.