Rapaka Varaprasadrao November 1, 2018 ·   తన తొలి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన తో పాటు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినా రెండు సీట్లలో లోను ఓడిపోయారు. ఇది జనసైనికులకు జీర్ణించుకునే విషయంలా లేదు. మరోవైపు జనసేన ఒక్కే ఒక్క సీటు తన ఖాతాను తెరిచింది. రాపాక వరప్రసాద్ రాజోలు నుండి ఎన్నికయ్యారు. జనసేన పార్టీ నుండి మొట్టమొదటి సారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోయే అభ్యర్థి ఆయనే.

అసలు ఎవరు ఈ రాపాక వరప్రసాద్? పవన్ కళ్యాణ్ కి సైతం సాధ్యం కానిది ఆయనకు ఎలా సాధ్యం అయ్యింది అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రాజకీయాలకు రాపాక వరప్రసాద్ కొత్తేమీ కాదు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీనితో వ్యక్తిగతంగా ఆయనకు కొంత క్యాడర్‌ ఉంది. అక్కడి సర్పంచులు, స్థానిక నాయకులతో సంబంధ బాంధవ్యాలున్నాయి. 2014లో కాంగ్రెస్‌ ఘోర పరాభవం తర్వాత ఆయన ఆ పార్టీని వీడి నియోజకవర్గంలో స్వతంత్రంగా ఉంటూనే కార్యకలాపాలు కొనసాగించారు.

సహజంగానే పట్టున్న నాయకుడు కావడం, గ్రామాల్లో తనకంటూ యంత్రాంగం ఉండటం కలిసి వచ్చింది. కాపులు నిర్ణయాత్మక స్థాయిలో ఉండటం, జనసేన బలమూ ఆయనకు గెలుపుకు కలిసి వచ్చింది. మిగతా నియోజకవర్గాలలో ఇదే క్యాడర్, యంత్రాంగం లేకపోవడం వల్ల ఆ పార్టీ దెబ్బతింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో కూడా అటువంటి క్యాడర్, ఆయన ఎన్నికను భుజంపై వేసుకుని నడిపించే స్థాయి గల నాయకులు లేకపోవడంతో రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు.