RangDe - Wild Dogథియేటర్లు తీర్చుకుంటున్నాయి. క్రిస్మస్ కు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా విడుదల అవ్వనుంది. సంక్రాంతి నుండి అంతా మాములు అవుతుందని పరిశ్రమ ఆశాభావంగా ఉంది. అయితే రెండు చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం ఇంకా ఓటీటీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి.

కింగ్ నాగర్జున యొక్క వైల్డ్ డాగ్ మరియు నితిన్ యొక్క రంగ్ దే సంక్రాంతి విడుదలకు రెడీ గా ఉన్నాయి. అయితే, ఈ రెండు చిత్రాలకు ఓటీటీ ప్లాట్‌ఫాంల నుండి ఆసక్తికరమైన ఆఫర్లు రావడంతో చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే వైల్డ్ డాగ్ నెట్‌ఫ్లిక్స్ మరియు థియేటర్లలో ఒకేసారి విడుదల కావచ్చు. దాని గురించి రెండు వారాల్లో స్పష్టత పొందవచ్చు.

రంగ్ దే మాత్రం పూర్తిగా ఓటీటీ విడుదల దిశగానే చర్చలు సాగుతున్నాయి. లోక్ డౌన్ కారణంగా పరిశ్రమ మూతపడటానికి ముందు టాలీవుడ్ కు భీష్మ తో చివరి హిట్ ఇచ్చాడు నితిన్. అయితే నితిన్ కూడా థియేటర్లలో సినిమా విడుదల చెయ్యడానికి ఆలోచించడం గమనార్హం.

మరోవైపు… సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ వచ్చే వారాంతంలో థియేటర్లలో విడుదల కానుంది. చిత్రనిర్మాతలు తమ సినిమా విడుదలల గురించి నిర్ణయం తీసుకోవడానికి ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అని ఆసక్తిగా వేచి చూస్తారు. దాని బట్టి ఓటీటీల ప్రభావం టాలీవుడ్ మీద తగ్గుతుందా లేక మరికొన్ని రోజులు కొనసాగుతుందా అనేది చూడాలి.