Rangasthalam-Teaser-Talk-Fantastic-Makeover-Reaches-Expectationsమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘రంగస్థలం’ టీజర్ విడుదలైన ఉత్సాహంలో మెగా అభిమానులు ఉన్నారు. ఓ వైపు ఈ టీజర్ కు సోషల్ మీడియాలో అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వస్తుండగా…. మరో వైపు రామ్ చరణ్ ఇంటి బయట బాణసంచాలు పేల్చి, ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు.

“మిస్టర్ సి’ ఇంటి బయట ఇలా ఉంది. మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, టీజర్ మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను…” అంటూ ఉపాసన ట్విట్టర్ వేదికగా సందేశాన్ని వినిపించారు. నిజానికి ఒక్క మెగా ఫ్యాన్సే కాకుండా, అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ‘రంగస్థలం’ టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ ఆనందోత్సాహాలను రామ్ చరణ్ కు తెలిసేలా చేయడంలో మెగా ఫ్యాన్స్ సక్సెస్ అయ్యారు.