Rangasthalam record collections in chennaiతెలుగు కథ విదేశాల్లోనే తయారై .. విదేశాల్లోనే షూటింగు జరుపుకుంటోన్న ఈ రోజుల్లో, ‘రంగస్థలం’తో పల్లెటూరి వాతావరణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు సుకుమార్. గతంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన చాలా చిత్రాలు ఘన విజయాలను సాధించాయి, ఆయా హీరోల కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిపోయాయి. అలా ‘రంగస్థలం’ కూడా చరణ్ కెరియర్లో నిలిచిపోయేలా కనిపిస్తోంది.

శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది, అలాగే యూఎస్ లోను ఏ మాత్రం స్పీడ్ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చెన్నైలోను ఈ సినిమా తన సత్తా చాటుకుంది. తొలి రోజునే ఒక రికార్డును సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ విషయం పక్కన పెడితే, చెన్నైలో తొలి రోజున 24 లక్షల గ్రాస్ ను సాధించి ఇంతవరకూ ‘అజ్ఞాతవాసి’ మొదటిస్థానంలో వుంది.

ఇక తాజాగా 25 లక్షల గ్రాస్ ను రాబట్టి ‘రంగస్థలం’ మొదటి స్థానంలో నిలిచింది. బాబాయ్ రికార్డును అబ్బాయ్ క్రాస్ చేయడం విశేషమే గానీ, చెన్నైలో ఈ రికార్డ్ ఎలా సాధ్యమయ్యింది అనేది ఆసక్తికరంగా మారింది. గత నెల రోజులుగా తమిళనాడులో కోలీవుడ్ చిత్రాలు విడుదల కావడం లేదు.

ఈ నేపథ్యంలో కొత్త సినిమాలు లేక చెన్నై వాసులు బోర్ ఫీల్ అవుతున్నారు. ఈ తరుణంలో ‘రంగస్థలం’ విడుదల కావడం, అది ఆకట్టుకోవడం, పాజిటివ్ రివ్యూలు రావడం, అక్కడ నివసిస్తున్న తెలుగు వారికి ఉల్లాసాన్ని కలిగించింది. సినిమా చూడ్డానికి చెన్నైలోని తెలుగు తంబీలు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో ఈ చిత్రం విడుదలైన థియేటర్లన్నీ కళకళలాడుతున్నాయి.