Rangasthalam - What The Numbers Say!ఈ ఏడాది సమ్మర్ బొనంజాకు తెరలేపిన సుకుమార్ – రామ్ చరణ్ ల “రంగస్థలం” సినిమా టాలీవుడ్ లో ‘నాన్ బాహుబలి’ రికార్డులను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన కలెక్షన్స్ పోస్టర్స్ సంగతి పక్కన పెడితే, ఈ సినిమా ఈ సమ్మర్ లో సెన్సేషనల్ సక్సెస్ గా నిలిచిందని చెప్పడంలో సందేహం లేదు.

ఇప్పటికీ వీకెండ్స్ లో పర్వాలేదనిపించే విధంగా వసూళ్లు ఉండడం ఈ సినిమా సక్సెస్ రేంజ్ కు నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఏపీ, తెలంగాణాలతో పాటు యుఎస్ లోనూ నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ నెల 14వ తేదీన విడుదల కాబోతోంది. దీంతో ‘రంగస్థలం’ వెబ్ రిలీజ్ కోసం కౌంట్ డౌన్ షురూ అయ్యింది.

విశేషం ఏమిటంటే… అప్పటికి ఇంకా సినిమా 50 రోజులు కూడా పూర్తి చేసుకోదు. నాన్ బాహుబలి రికార్డులు కొట్టిన సినిమా సైతం 50 రోజుల లోపే వెబ్ లో ప్రత్యక్షం అవుతుండడం చెప్పుకోదగ్గ విషయం. అయితే ఇంత తక్కువ రోజులలో ప్రదర్శించుకోవడానికే డిజిటల్ రైట్స్ రూపంలో పెద్ద మొత్తంలో ఫ్యాన్సీ నెంబర్లను నిర్మాతలకు చెల్లిస్తున్నారు.