Rangasthalam Movie Music Reviewఇటీవల విడుదలైన సుకుమార్ – రామ్ చరణ్ ల “రంగస్థలం” ఆల్బమ్ కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. తొలుతగా రిలీజ్ చేసిన మూడు సింగిల్ సాంగ్స్ తోనే ఈ ఆల్బమ్ రేంజ్ ఏంటో చెప్పిన దేవి, మిగిలిన రెండు పాటలతో ఓకే అనిపించాడు. అయితే ఈ ఆల్బమ్ లో ఉన్న ‘ఆ గట్టుకుంటావా నగన్న ఈ గట్టుకోస్తావా’ అనే పాట మాత్రం వచ్చే ఏడాది వరకు హంగామా చేయడం ఖాయం అని బల్లగుద్ది చెప్పవచ్చు.

అవును… ఈ సినిమా విడుదలైన నాటి నుండి ఈ పాటను ‘రంగస్థలం’ యూనిట్ కంటే కూడా మీడియా వర్గాలు బాగా ఉపయోగించుకోబోతున్నాయి. సినిమాలో ఓ పొలిటికల్ సెటైర్ నేపధ్యంలో ఈ పాట రానుంది. అంటే పార్టీలు మారిన వారిపై ఎటకారంగా రాసిన పాట. ఈ సాంగ్ సాహిత్యాన్ని పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతుంది. వర్తమాన రాజకీయాలను ప్రతిబింబించే పాట కావడంతో, 2019 ఎన్నికల వరకు ఈ పాట సందడి షురూ చేయనుంది.

రానున్నది ఎన్నికల కాలం… అందుకు అనుగుణంగా పార్టీలు మారే నేతలు ఎందరో ఎందరెందరో..! ముఖ్యంగా ఏపీలో జనసేన రూపంలో అవకాశం ఉండడంతో, ‘జంపింగ్ జిలానీ’ల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే అంతర్గత సర్వేలు, సీట్లు దక్కని వారు జెండాలు మార్చడం వర్తమాన రాజకీయాలలో సహజమే! అలాంటి వారి కోసమే ఈ “ఆ గట్టుకుంటావా నగన్న…. ఈ గట్టుకోస్తావా…” అనే పాట.