Rangasthalam in malayalamతెలుగునాట ‘నాన్ బాహుబలి’ రికార్డులను కైవసం చేసుకున్న సుకుమార్ – రామ్ చరణ్ ల మ్యాజిక్ మూవీ “రంగస్థలం” త్వరలో మలయాళంలో కూడా విడుదల కానుంది. నవంబర్ లో ఈ సినిమాను కేరళలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ మరియు పబ్లిసిటీ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు.

కేరళలో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా మెగా హీరో అల్లు అర్జున్ ఇక్కడ ఓ సూపర్ స్టార్. దీంతో మరో మెగా హీరో కూడా మలయాళ రంగస్థలంపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ సబ్జెక్ట్ మలయాళ ప్రేక్షకులు కూడా మెచ్చుకునే విధంగానే ఉండడంతో డబ్ అవుతోందని, ఖచ్చితంగా అక్కడ బంపర్ హిట్ అవుతుంది అంటున్నారు అభిమాన వర్గం.