rangasthalam blockbuster collectionsచిట్టిబాబుగా రామ్ చరణ్… రామలక్ష్మిగా సమంత నటించిన ‘రంగస్థలం’ క్రితం నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి 4 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 45 కోట్ల షేర్ ను వసూలు చేసినట్లుగా టాక్. ఇక ఓవర్సీస్ లో తొలి 4 రోజుల్లో ఈ సినిమా 2.45 మిలియన్ డాలర్లను రాబట్టేసింది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే తొలి 4 రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను సాధించి, సరికొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది.

‘బాహుబలి’ తరువాత అంత వేగంగా 100 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాగానే కాకుండా, చాలా చోట్ల ‘బాహుబలి 1’ రికార్డులను బద్దలు కొడుతుండడం విశేషం. ఫుల్ రన్ లో ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని తేలిపోయింది. మొత్తానికి సుకుమార్ .. చరణ్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాను అందించేశాడు. దర్శకుడిగా తన ప్రతిభా పాటవాలకు కొలమానంగా ఈ సినిమాను సెట్ చేశాడు.