Rangasthalam - What The Numbers Say!టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన సుకుమార్ – రామ్ చరణ్ ల మాస్ ఎంటర్టైనర్ “రంగస్థలం” ఓవర్సీస్ లోనూ దుమ్ము దులిపిన విషయం తెలిసిందే. అన్ని ఏరియాలలో నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకున్న ‘రంగస్థలం’ యుఎస్ మార్కెట్ లో ల్యాండ్ మార్క్ ఫిగర్ కు చేరువైంది.

యుఎస్ లో అంతకుముందు ‘శ్రీమంతుడు’ పేరిట ఉన్న (2.89 మిలియన్స్) రికార్డును బద్దలు కొట్టిన ‘రంగస్థలం’ తాజా కలెక్షన్స్ 3.37 మిలియన్స్ కు చేరాయి. ఈ వారం ‘భరత్ అనే నేను’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో, 3.50 మిలియన్స్ కు చేరుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

‘రంగస్థలం’ ఎంత కొల్లగొట్టినా, ‘భరత్ అనే నేను’ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, రామ్ చరణ్ సాధించిన రికార్డులు కనుమరుగు కావడం ఖాయం అన్న టాక్ ట్రేడ్ పండితుల నుండి వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఏ సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొట్టినా, 3 మిలియన్ క్లబ్ (బాహుబలిని మినహాయిస్తే) ను ఓపెన్ చేసిన ఘనత ‘రంగస్థలం’కే దక్కుతుంది.

ఓవర్సీస్ లో ఇలా దుమ్ము దులుపుతుంటే… ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ 200 కోట్లకు చేరుకుంటాయా? లేదా? అన్నది కూడా ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద హౌస్ ఫుల్ కలెక్షన్స్ బోర్డులు పడుతుండడంతో, మరికొద్ది రోజుల్లోనే ఆ ల్యాండ్ మార్క్ వార్త కూడా వినే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.