Rangasthalam 1985 Satellite Rights ‘క్రియేటివ్ దర్శకుడు’ సుకుమార్ దర్శకత్వంలో ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న “రంగస్థలం 1985” సినిమా రికార్డుల వేట ప్రారంభించింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి టైటిల్ లోగో తప్ప అధికారికంగా ఏమీ విడుదల కాకపోయినా, ఒక్క టైటిల్ తోనే సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాణం అవుతోన్న భారీ సినిమాలలో, ‘రంగస్థలం’ కూడా క్రేజీగా మారింది.

ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కుల ధరలు టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి. ఇటీవల కాలంలో బుల్లితెరపై ప్రదర్శితం అవుతోన్న సినిమాలకు టీఆర్పీ రేటింగ్స్ సరిగ్గా రాకపోతుండడంతో, శాటిలైట్ హక్కులకు క్రేజ్ కాస్త తగ్గింది. ఇలాంటి పరిస్థితులలోనూ చెర్రీ – సుకుమార్ ల “రంగస్థలం 1985” ఏకంగా 16 కోట్లకు ఓ ప్రముఖ టెలివిజన్ ఛానల్ దక్కించుకుందని, ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తున్న సమాచారం.

ఇదే నిజమైతే రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలవనుంది. అంతేకాదు, ఇటీవల కాలంలో చాలా పెద్ద చిత్రాలు కూడా ఈ స్థాయి మొత్తాన్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. బుల్లితెర హక్కులే ఈ రేంజ్ లో ఉంటే, మరి ధియేటిరికల్ హక్కుల ధరలు ఏ స్థాయికి వెళ్తాయో అన్న ఆసక్తి ట్రేడ్ వర్గాలలో నెలకొంది. అయితే ఇదంతా కూడా ఒక్క టైటిల్ లోగోనే చేస్తోంది… ఇంకా టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో..!