Rangasthalam 1985 movie teaser on 24th Januaryమూస ధోరణిలో సినిమాలు చేసే రామ్ చరణ్ ఒక వైపు… కొత్తదనం లేనిదే కనీసం ఒక సీన్ కూడా చేయని సుకుమార్ మరో వైపు… ఈ ఇద్దరి కలయికతో “రంగస్థలం” సినిమాపై అత్యంత ఆసక్తి నెలకొంది. కేవలం మెగా అభిమానులే కాదు, సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ డేట్ ను చిత్ర యూనిట్ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు ఆ తేదీ కోసం వేచిచూస్తున్నారు.

జనవరి 24వ తేదీ సాయంత్రం 4.15 నిముషాలకు టీజర్ ను విడుదల చేయనున్నట్లుగా పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు. చెరువులో నవ్వుతూ ఉన్న రామ్ చరణ్ కటౌట్ ఈ పోస్టర్ లో దర్శనమివ్వగా, అదిరిపోయే విధంగా చెర్రీ స్మైల్ ఇస్తున్నాడు. 1985 కాలం నాటి కధతో సుకుమార్ సృష్టించబోతున్న అద్భుతం ఎలా ఉంటుందో, ఒక చిన్న శాంపిల్ చూడాలంటే ఈ నెల 24 వరకు వేచిచూడాల్సిందే. అయితే ఈ సినిమాపై ఇండస్ట్రీ జనాల్లో ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉండడం చెప్పుకోదగ్గ విషయం.