Effortless-Hat-trick-From-DSP-For-Rangasthalam---Rangamma-Mangammaఈ ఏడాది యూ ట్యూబ్ ప్రియులను ఒక ఊపు ఊపిన పాట ‘రంగమ్మ మంగమ్మ.’ దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ పాట యూ ట్యూబ్ లో టాలీవుడ్ కు సంబంధించి ఆల్ టైం రికార్డును నెలకొల్పింది. లిరికల్ సాంగ్స్ లోనే అత్యధికంగా 60 మిలియన్స్ పైగా క్లిక్స్ ను అందుకున్న ఈ పాట సిల్వర్ స్క్రీన్ పైన విజువల్ గా అద్భుతంగా ఉంది. సినిమా విజయంలో ‘రంగస్థలం’ పాటలు కూడా కీలకపాత్రను పోషించాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా హంగామా ముగియడంతో, ఒక్కో వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

తొలుతగా ‘ఎంత సక్కగున్నావే’ పాటను రిలీజ్ చేయగా, తాజాగా ఈ బ్లాక్ బస్టర్ సాంగ్ ‘రంగమ్మ మంగమ్మ’ను విడుదల చేసారు. నిజానికి సమంత పుట్టినరోజునే ఈ పాటను విడుదల చేయాలని ముందుగా భావించిన్నప్పటికీ, లాస్ట్ వీకెండ్ లో కలెక్షన్స్ పై ప్రభావితం చూపుతాయేమోనని, చెప్పిన సమయాని కంటే మూడు రోజుల తర్వాత రిలీజ్ చేసారు. మరి ఆడియో సాంగ్ మాదిరి ఈ వీడియో సాంగ్ కూడా అదిరిపోయే క్లిక్స్ తో యూ ట్యూబ్ లో టాలీవుడ్ పేరిట సరికొత్త రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.